జీవితంపై విరక్తితో వృద్ధురాలి ఆత్మహత్య
ధర్మారం,ఆగస్టు20( కలం శ్రీ న్యూస్):జీవితంపై విరక్తి చెంది ధర్మారం మండలం బుచ్చయ్యపల్లె గ్రామానికి చెందిన ఎం.డి గొరభి(80) అనే వృద్ధురాలు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ధర్మారం ఎస్సై టి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..ఆమె కొడుకు గత కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు.ఆమె ముసలితనం వల్ల జీవితంపై విరక్తి చెంది తనకి తానుగా తన ఊరిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది అని, కాగా మృతురాలి కొడుకు ఆలి ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.