Sunday, May 26, 2024
Homeతెలంగాణమంథని పట్టణంలోని ఇంట్లో చోరీ 

మంథని పట్టణంలోని ఇంట్లో చోరీ 

మంథని పట్టణంలోని ఇంట్లో చోరీ 

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్  

మంథని,ఆగస్టు 20 (కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలోని ఓ ఇంట్లో చోరీ చేసి వృద్ధురాలుపై విచక్షణ రహితంగా దాడి చేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని రావులచెరువు కట్టకు చెందిన పాపిట్ల సంతోష్ అనే వ్యక్తి పని నిమిత్తం ఈనెల 18వ తేదీన హైదరాబాద్ కు వెళ్లారు. సంతోష్ ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆయన తల్లి పాపిట్ల జయప్రద అనే వృద్ధురాలి పై విచక్షణ రహితంగా దాడి చేశారు.ఇంట్లో ఉన్న నగలు,నగదు వివరాలు చెప్పాలంటూ తలా,ముఖం పై దాడి చేశారు. అనంతరం ఇంట్లో ఉన్న బీరువాలను పగలగొట్టి ఐదు తులాల విలువచేసే నగను ఎత్తుకెళ్లారు.అచేతన స్థితిలో ఉన్న వృద్ధురాలు రెండు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయింది. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చిన సంతోష్ అచేతన స్థితిలో ఉన్న తల్లిని చూసి స్థానికుల సాయంతో కిటికీలు తీసి ఇంట్లోకి వెళ్లారు. తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇంట్లో ఐదు తులాల బంగారు నగ, 40 తులాల వెండి దొంగతనం జరిగినట్లు సంతోష్ తెలిపారు. సంతోష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!