పలు కుటుంబాలను పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేసిన కాటారం పి.ఎ.సి.ఎస్ చైర్మన్ చల్లా
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 20 (కలం శ్రీ న్యూస్ ): హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో మంథని నియోజక వర్గం కాటారం మండలం బయ్యారం గ్రామానికి చెందిన చిన్నాల సత్తమ్మకు ఇటీవల శస్త్ర చికిత్స జరగగా ఆదివారం వెళ్లి పరామర్శించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వారు త్వరగా కోలుకోవాలని దైర్యం చెప్పారు.మహాదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి చెందిన చల్ల ఓదెలు యాదవ్ భార్య అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి.