మండల నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
మంథని,ఆగస్టు 19 కలం శ్రీ న్యూస్ ): మంథని మండల నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శనివారం మంథని పట్టణంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు సమావేశమై మంథని మండల కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.మండల గౌరవ అధ్యక్షునిగా విష్ణుభక్తుల రాజేందర్,మండల అధ్యక్షునిగా బొమ్మకంటి మల్లేష్, ఉపాధ్యక్షులుగా విష్ణుభక్తుల రమేష్, మంథని వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా విష్ణుభక్తుల రఘు,కోశాధికారిగా పందిళ్ళ నర్సయ్య, కార్యవర్గ సభ్యులుగా నిడిగొండ రవితేజ,మంథని సతీష్ , కందికట్ల చంద్రశేఖర్, కందికట్ల నాగరాజు,విష్ణుభక్తుల రమేష్, వేయికంట్ల సురేష్ లను ఎన్నుకొన్నారు. నాయి బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తానని అధ్యక్షుడు మల్లేష్ తెలిపారు.