Wednesday, December 4, 2024
Homeతెలంగాణఘనంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ వేడుకలు

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ వేడుకలు

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ

మంథని, ఆగస్టు 19 (కలం శ్రీ న్యూస్ ):మంథని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం 184వ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిం చారు.మొదటి సారిగా కెమెరాని ఆవిష్కరించి ప్రపంచానికి కెమెరాను పరిచయం చేసిన “లూయిస్ జాక్వెస్ మండే డాగురె” చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ముఖ్య అతిథిగా హాజరైన మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్ తూర్పాటి సత్యనారాయణ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీలో ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న మంథని బిడ్డకు ఘనంగా శాలువతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంథని మండల అధ్యక్షులు దండు రమేష్,ప్రధాన కార్యదర్శి జెట్టి శంకర్,కోశాధికారి నాగేల్లి మహేష్,ఇతర సీనియర్ ఫోటో గ్రాఫర్లు ప్రతాప్,గంధం నాగేష్, తూర్పాటి దామోదర్,గంధం అంజిబాబు, మాజీ అధ్యక్షులు అన్నం దేవేందర్,కొమ్మిడి క్రాంతి,తొగరి కిరణ్,మిట్టపెళ్లి కిషోర్, బర్ల కుమార్,నల్ల చంద్రశేఖర్, సాగర్ ,ప్రసాద్, సాయి, సూర్య, దండు రమేష్, అఖిల్, సంతోష్,మరియు సభ్యలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు మాట్లాడుతూ మండల ఫోటోగ్రాఫర్లకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు ఫోటోగ్రాఫర్ లందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!