గోసంరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలే
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని, ఆగస్టు 19 (కలం శ్రీ న్యూస్):దేశ సంస్కృతి సౌభాగ్యానికి ఆధారమైన గోవుల సంరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌అన్నారు.మంథని పట్టణంలోని రాజగృహాలో కపిల గోశాలకు సంబంధించిన కరపత్రాలను మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశ్వానికే తల్లిలాంటి గోమాతను పూజించే సంస్కృతి మనదన్నారు. కపిలగోశాల ద్వారా గోసంరక్షణ చేపట్టే కార్యక్రమాలను తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని,అలాగే ప్రతి ఒక్కరు తనవంతు బాధ్యతగా గోసంరక్షణకు సహకారం అందించాలని ఆయన ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమంలో మంథని వైస్ ఎంపీపీ కొమ్మిడి స్వరూప్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.