సంపద వనాల పరిశీలన
మంథని, ఆగస్టు 18 (కలం శ్రీ న్యూస్ ): సిరిపురం వద్దగల బ్యారేజ్ సంబంధించిన ఇరిగేషన్ ల్యాండ్ లో సంపద వనాల కింద నాటిన మొక్కలను పరిశీలించడానికి చీఫ్ సెక్రటరీ ఆదేశం మేరకు కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు సంబంధించిన స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ వై నర్సింగరావు శుక్రవారం హెలిప్యాడ్ ఏరియాలోని నాటినటువంటి సంపద వనాలు వెయ్యి 28 మొక్కలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు.పరిశీలించడానికి వారి వెంట ఎంపీడీవో బి రమేష్,ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస రావు,డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేష్, డిఆర్డిఏ నుంచి అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ,ఎస్ క్యూ సి ఉపేందర్ రావు,ప్లాంటేషన్ సూపర్వైజర్ మధుకర్,ఇరిగేషన్ ఇంజనీర్స్ విజయ్,శ్రీకాంత్, ఏపీవో సదానందం,జేఈ రాజేశం, టెక్నికల్ అసిస్టెంట్ తిరుపతి,పంచాయతీ కార్యదర్శి ఫయాజ్,ఫీల్డ్ అసిస్టెంట్ రవి ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.