ఈనెల 29న ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు
సుల్తానాబాద్,ఆగస్టు 18 (కలం శ్రీ న్యూస్ ) : మండల స్థాయి ఎస్.జి.ఎఫ్ క్రీడా పోటీలను ఈనెల 29,30 సెప్టెంబర్ నెల 1వ తేదీలలో నిర్వహిస్తున్నట్లు సుల్తానాబాద్ ఎం.ఈ.ఓ సురేందర్ తెలిపారు.శుక్రవారం సుల్తానాబాద్ ఎం.ఆర్.సి కార్యాలయంలో ఎం.ఈ.ఓ ఆధ్వర్యంలో మండల స్థాయి ఎస్.జి.ఎఫ్ క్రీడల నిర్వహణ పై మండల వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుల్తానాబాద్ మండల ఎస్.జి.ఎఫ్ క్రీడా పోటీలను ఈనెల తేదీ 29,30 వచ్చేనెల 1వ తేదీలలో నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని,29వ తేదీన 14,17 సంవత్సరాల విభాగంలో బాలికలకు,30వ తేదీన బాలురకు కో కో,కబడ్డీ,వాలీబాల్,సెప్టెంబర్ 1వ తేదీన బాలికలకు,బాలురకు 14 ,17 సంవత్సరాల విభాగంలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజేందర్ విజయ్,జోనల్ స్థాయి ఎస్ జి ఎఫ్ కన్వీనర్ సంధ్య, మండల ఎస్ జి ఎఫ్ కన్వీనర్ దాసరి రమేష్, మండల పి.ఈ.టిలు పాల్గొన్నారు.