Wednesday, September 18, 2024
Homeతెలంగాణనా మట్టి - నా దేశం:-బిజెపి పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు

నా మట్టి – నా దేశం:-బిజెపి పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు

నా మట్టి – నా దేశం

బిజెపి పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు

సుల్తానాబాద్, ఆగస్టు10(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ భారతీయ జనతా పార్టి పట్టణ శాఖ ఆధ్వర్యంలో… దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అజాది కా అమృత్ మహోత్సవ్ (నా మట్టి.. నా దేశం) భారత ప్రధాని  నరేంద్ర మోడీ  ఆదేశాలతో ఆగస్టు 9 నుండి 30 వరకు నిర్వహించనున్న బిజెపి కార్యక్రమాలలో భాగంగా గురువారం దేశం కోసం సేవ చేసి రిటైర్డ్ అయిన జవాన్లను సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ ఆర్మీ లు ఎం.రత్నప్రసాద్, ఏ.వి.సుబ్బారెడ్డి, ఏ. ప్రేమ్ సాగర్, సత్యనారాయణ  సన్మానించడం జరిగినది. ఈసందర్బంగా సుల్తానాబాద్ బిజెపి పట్టణ అధ్యక్షులు  కూకట్ల నాగరాజు  మాట్లాడుతూ… మన దేశ స్వాతంత్రం కోసం ఏంతో మంది ప్రాణాలు అర్పించారని, స్వాతంత్రం తరువాత కొన్ని ఉగ్రవాద సంస్థలు దేశాన్ని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నించాయని కానీ మన దేశ సైనికులు ఎప్పటికప్పుడు  తిప్పికొట్టారని, అందులో భాగంగానే దైర్యవంతులైన మాజీసైనికులు, మాజీ జవాన్లను సత్కరించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సీనియర్ నాయకులు ఎగోలపు సదయ్య గౌడ్, చిట్టవేని సదయ్య, గజభింకర్ పవన్, ఎనగందుల సతీష్. బుర్ర సతీష్ గౌడ్. అరేపల్లి రాకేష్, తోర్రికొండ అజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!