Wednesday, December 4, 2024
Homeతెలంగాణనిధులు వచ్చాక కలెక్టర్ కు ఎమ్మెల్యే లేఖ రాయడం విడ్డూరం

నిధులు వచ్చాక కలెక్టర్ కు ఎమ్మెల్యే లేఖ రాయడం విడ్డూరం

నిధులు వచ్చాక కలెక్టర్ కు ఎమ్మెల్యే లేఖ రాయడం విడ్డూరం

మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్

 మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,ఆగస్టు 2( కలం శ్రీ న్యూస్): గతంలోనే జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్,మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ కృషితో మంథని మున్సిపల్ కాంప్లెక్స్ పై అంతస్తు నిర్మాణానికి నిధులు వచ్చినా అదే మున్సిపల్ కాంప్లెక్స్ కు నిధులను ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కలెక్టర్ కు విజ్ఞప్తి చేయడం సిగ్గుచేటని మంథని మున్సి పల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ విమర్శించారు. బుధవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ విజ్ఞప్తి మేరకు జూన్ మాసంలోనే మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అధ్యక్షతన మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించి,బస్టాండ్ ఏరియా షాపింగ్ కాంప్లెక్స్ ఫస్ట్ ప్లోర్ నిర్మాణానికి మరమ్మతులు చేపట్టేందుకు రూ.35 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశామని గుర్తు చేశారు. ఆ మేరకు ప్రభుత్వం జూలై 6న నిధులను విడుదల చేస్తూ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చిందని చెప్పారు.ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తానే నిధులు మంజూరు చేయించినట్లు చెప్పుకోవాలనే పెద్దరికంతో తాజాగా కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అక్కడితో అగకుండా కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రాన్ని సోషల్ మీడియాలో పెట్టి నిధులు తెస్తున్నట్లు వైరల్ చేయడం సిగ్గుచేటన్నారు.ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గానికి కొత్తగా ఏ పని మంజూరు చేయించింది లేదని,నిధులను తెచ్చింది లేదని విమర్శించారు.ప్రభుత్వం,జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్,మున్సి పల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ మంజూరు చేయించిన పనులను తాను చేయించినట్లుగా చెప్పుకోవాలనే దుర్బుద్ధితోనే ఇలాంటి నీతిలేని చర్యలకు పాల్పడు తున్నాడని మండిపడ్డారు.ఇప్పటికైనా ఆయన మోసాలను ప్రజలు గమనించి, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో బహిరంగంగా తెలపాలని డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు వీకే రవి,గర్రెపల్లి సత్యనారాయణ, కాయితి సమ్మయ్య, కుర్ర లింగయ్య,కో ఆప్షన్ సభ్యులు ఎస్కే యాకుబ్ లు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!