Tuesday, December 3, 2024
Homeతెలంగాణజర్నలిస్టులకు సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

జర్నలిస్టులకు సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

జర్నలిస్టులకు సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

మంథనిలో టీయూడబ్ల్యుజే (ఐజేయూ) ఆద్వర్యంలో పోస్ట్ కార్డుల ఉద్యమం

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్

మంథని,ఆగస్టు 1( కలం శ్రీ న్యూస్ ): జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (ఐజేయూ) నాయకులు డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జర్నలిస్టుల సమస్యలు జీ పరిష్కరించాలని టీయూడబ్ల్యుజే (ఐజేయూ) ఆద్వర్యంలో మంథని ప్రెస్ క్లబ్ సభ్యులు సీఎం కేసీఆర్ కు పోస్టు కార్డుల ద్వారా విన్నవించారు.ఈ సందర్భంగా మంథనిలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ లు పోషించిన భూమిక అత్యంత కీలకమైనదని అనేక సార్లు సీఎం కేసీఆర్ జర్నలిస్టులను ప్రశంసించారని,ఉద్యమ నేతగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా జర్నలిస్ట్ లకు అనేక హామీలు ఇచ్చారని,కానీ ఇప్పటివరకు హామీలు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల చిరకాల స్వప్నం అయిన ఇళ్ల స్థలాలు అర్హులైన జర్నలిస్టులకు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.అకస్మాత్తుగా అనారోగ్యాలకు గురవుతున్న జర్నలిస్టులు చికిత్స పొందే ఆర్థిక స్థోమత లేక అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారని, మరి కొందరు వైద్యం కోసం అప్పుల పాలవుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టు ఆరోగ్య పథకం జేహెచ్ఎస్ కింద అందించిన హెల్త్ కార్డులు అమలయ్యేలా వెంటనే చర్యలకు తీసుకోవాలని కోరారు.ఆర్థికంగా వెనుకబడి ఉన్న జర్నలిస్టులను గుర్తించి జర్నలిస్టు బంధు పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు పోతరాజు సమ్మయ్య,జిల్లా సహాయ కార్యదర్శి కొమురోజు చంద్రమోహన్,జిల్లా కోశాధికారి పెండ్యాల రామ్ కుమార్,జిల్లా కార్యవర్గ సభ్యుడు సిలివేరి మహేందర్,మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్, జర్నలిస్టులు కొమురోజు మారుతి, ఆర్ల బాపు, తగరం రాజు, లక్కాకుల నాగరాజు,బసాని సాగర్,కంది కృష్ణారెడ్డి,మహవాది సతీష్ మాటేటి కుమార్,బండారి సురేష్,నాంపల్లి శ్రీనివాస్ లతో పాటు పలువురు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!