బిఆర్ఎస్ లో చేరిన యువకులు
వెల్గటూర్,జూలై 29 ( కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు కుమ్మరి మహేష్,కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ సెక్రటరీ మేకల అరుణ్,ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామం నుండి బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు తోట్ల మల్లయ్య,పాతగూడూర్ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ సభ్యులు గుడిమల్ల సందీప్ కుమార్ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై శనివారం రోజున కరీంనగర్ మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి గారు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ… కెసిఆర్ ప్రభుత్వం ప్రజల,రైతుల కష్టాలు తీర్చి అనేక సంక్షేమ పథకాలను ప్రజల ముందు ఉంచి అన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఇలాంటి అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయం అని రానున్న ఎన్నికలకు బిఆర్ఎస్ విజయాన్నీ తెలపడానికి ఇది శుభ సూచకమని ధీమా వ్యక్తం చేశారు.ఇలాగే రానున్న ఎన్నికల్లో బారాసాను మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు.పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులకు పార్టీ తరఫు నుండి ఎల్లవేళలా అండదండలు ఉంటాయని తెలియజేశారు. పార్టీలో చేరిన నూతన సభ్యులను బారాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.