సినీ గేయ రచయిత సినారే విగ్రహాలు నెలకొల్పాలి: కొండేలా మారుతి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 29( కలం శ్రీ న్యూస్ ):జ్ఞాన పీఠం అవార్డు గ్రహీత తెలుగు సాహిత్య సవ్యసాచి సీనీ గేయ రచన విఖ్యాతులు స్వర్గీయ సినారె విగ్రహలను తెలుగు రాష్ట్రాల లో ప్రతిష్టాపించాలని ఆయన జయంతి కార్యక్రమంలో కొండేల మారుతి పేర్కొన్నారు.తెలుగు వారి ముద్దు బిడ్డ మేధోనిది స్వర్గీయ సింగిరెడ్డి నారాయణ రెడ్డి సాహిత్య సామ్రాట్ గా తెలుగు భాషకు నిరంతరంగా వారీ జీవన గమనం వరకు విశిష్ట సేవలందించిన మహానుభావుడన్నారు.సాహిత్యమే శ్వాసగా ద్యాసగా వృత్తి ప్రవృత్తి గా పరితపించిన సినారే విగ్రహాలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ల లోని ముఖ్య నగరాల్లో స్థాపించాలని కోరారు.ఈ నేపథ్యంలో ఉభయ ముఖ్యమంత్రులతో ప్రాతినిధ్యం సల్పుతామన్నారు.కరీంనగర్ హైదరాబాద్ అమరావతి వైజాగ్ తిరుపతి కేంద్రాలలో ఏర్పాట్లు చేయాలని అన్నారు.ఈ ప్రక్రియలో సాహితీ వేత్తలు సముచిత కృషి చేయాలని అన్నారు.ఈమేరకు మంథనిలో కూడ విగ్రహ స్థాపనకు మంథని మున్సిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజ, పెద్దపల్లి జడ్ పి ఛైర్మన్ పుట్ట మధుకర్ లను సంప్రదించనున్నమన్నారు. స్వర్గీయ సింగిరెడ్డి నారాయణరెడ్డి విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఉభయ రాష్ట్రాల వారీగా కృషి జరిపేలా తగు కార్యాచరణతో సభ్యుల నియమాకం చేస్తామన్నారు. మంథని విద్యార్థి యువత కార్యాలయంలో నిర్వహించిన సినారె జయంతి వేడుకలలో పాల్గొని ప్రసంగించిన టిఆర్ఎస్ నాయకులు తాటి బుచ్చన్న గౌడ్, రామడుగు మారుతి రావు, మేడగోనీ రాజమౌళి గౌడ్ లు తమ సంఘీభావం ప్రకటించారు.సినారె విగ్రహాల స్థాపనలో తగు కృషి చేస్తామని మద్దతు ప్రకటించిన సమావేశ ప్రారంభంలో సినారె విగ్రహ సమాచార సమగ్రత పోష్టర్లను ఆవిష్కరించారు.