Thursday, September 19, 2024
Homeతెలంగాణగ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచి,పర్మినెంట్ చేయాలి

గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచి,పర్మినెంట్ చేయాలి

గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచి,పర్మినెంట్ చేయాలి

కారోబార్,బిల్ కలెక్టర్ లను పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జులై 29(కలం శ్రీ న్యూస్ ):పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె కు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి తమ మద్దతు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని బూటకపు హామీలిచ్చి చిన్నచిన్న ఉద్యోగులపై అధిక పని భారం మోపడమే కాకుండా కనీసం వేతనం ఇవ్వడం లేదు.కెసిఆర్ కి ఫౌమ్ హౌస్, ప్రాజెక్టులు కట్టడానికి నిధులు ఉంటాయి కాని ఇలాంటి పేద ఉద్యోగులకు జీతాలు పెంచండానికి నిధులు ఉండవా?పక్క రాష్ట్రo లో వాలంటీర్ లని రెగ్యులరైజేషన్ చేస్తే మన రాష్ట్రo లో మల్టీ పర్పస్ వర్కర్ ని ఎందుకు చేయడం లేదు.ఎప్పటికైనా జి ఓ నెంబర్ 51 ను సవరించాలి,ప్రమాదంలో మరణించిన వర్కర్ కి 10 లక్షలు చెల్లించాలి,అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్స్ లను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి వారికి పిఆర్సి విధానాన్ని అమలుపరిచి పర్మినెంట్ చేయాలని అదేవిధంగా 12 గంటల దినాన్ని పెట్టి వారిచే వెట్టి చాకిరీ విధానానికి స్వస్తి పలికి ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలని అదేవిధంగా అర్హతలు ఉన్న కారోబార్లను సహాయ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్లు ఇవ్వాలని, గ్రామపంచాయతీ ఉద్యోగులకు ఈఎస్ఐ,పిఎఫ్ లాంటి కనీస మౌలిక ఏర్పాట్లు చేయాలని లేనిచో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి,మండల ప్రధాన కార్యదర్శి అరె ఓదెలు,ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు బూడిద రాజు,మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు చంద్ పాషా,బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బుర్ర రాజు గౌడ్,సీనియర్ నాయకులు ఎడ్ల సదశివ్,కాసిపేట సంతోష్,కనుకట్ల సుధాకర్,రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!