ఇంకా ఎన్ని సంవత్సరాలు మా మంథని ప్రాంత ప్రజలు నష్టపోవాలి కెసిఆర్
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 28 (కలం శ్రీ న్యూస్ ):పెద్దపల్లి జిల్లా మంథని మండలం సోమనపల్లి,మల్లారం, నాగేపల్లి గ్రామాలలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వరదల వల్ల నీట మునిగిన ప్రాంతలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పర్యటిచి నష్టం పోయిన రైతులను పరామర్శించారు.అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మంథని నియోజకవర్గ ప్రజలు వర్షాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల తీవ్రంగా నష్టం పోతున్నాము,వ్యాపారులు, రైతుల పొలాలు,ఇల్లు మునిగిపోతున్న అధికారులు, ప్రజప్రతినిధులు మొద్దు నిద్ర వదలడం లేదు,గత సంవత్సరం మంథని పట్టణం పూర్తిగా మునిగి తీవ్ర నష్టం జరిగితే ఒక రూపాయి నష్టపరిహారం చెల్లించలేదు, ఒకరిని ఒకరు తిట్టుకునే ప్రజ ప్రతినిధులు మంథని ప్రాంత ప్రజలకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారు. వెంటనే ప్రభుత్వం మంథని నియోజకవర్గనికి శాశ్వత పరిష్కారం చూపించాలి లేని పక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో మండలం అధ్యక్షులు విరబోయిన రాజేందర్, ఐటీ సోషల్ మీడియా అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ తోట్ల రాజు, సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్,సోషల్ మీడియా ఇంచార్జ్ గుమ్మడి నవీన్,ఎస్ సీ మోర్చా జిల్లా కార్యదర్శి కాశిపేట మల్లేష్,బీజేవైఎం మంథని పట్టణ అధ్యక్షులు బుర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.