టార్పాలిన్ కవర్లు పంపిణీ చేయించిన బొద్దుల లక్ష్మణ్
సుల్తానాబాద్,జులై28(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా ధ్వంసం అయిన గుడిసెలు, రేకుల ఇంటి పై కప్పడానికి టార్పాలిన్ కవర్లు కావాలని స్థానిక నాయకులు, కెసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, పద్మశాలి సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ని కోరగా వెంటనే స్పందించి, వారు కెసిఆర్ సేవా దళం నాయకుల ద్వారా పరదాలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో బి.అర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాధారపు సాగర్ రావు, వార్డు సభ్యులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
ఇట్టి సహాయం అందించిన బిసి ఉద్యమ యువ నాయకులు బొద్దుల లక్ష్మణ్ కి బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.