భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రజలకు సూచనలు జారీ చేసిన వెల్గటూర్ ఎస్సై శ్వేత
వెల్గటూర్,జులై26(కలం శ్రీ న్యూస్):రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్గటూర్ ఎస్సై కొక్కుల శ్వేత హెచ్చరించారు.వర్షం పడుతున్నప్పుడు అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని,చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద బారీగా నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటకూడదని.వర్షంతో వరద నీటి తాకిడికి చెరువులు,కుంటలు నిండి కట్టలు తెగే ప్రమాదం ఉంటే వెంటనే పోలీసు వారికి గాని,స్థానిక సర్పంచులకు గాని సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.ఎట్టి పరిస్థితిలో చెరువులలోకి చేపల వేటకు వెళ్ళవద్దని,గొర్రెలు,మేకలు,ఆవులు,గేదెలు మేపు వాళ్ళు మేపుటకు వెళ్లకూడదని,చెట్ల కింద పాడైన భవనాలు కింద,శిధిలావస్థలో ఉన్న ఇండ్లల్లో ఉండ కూడదని,విద్యుత్ స్థంభాలు,ట్రాన్స్ ఫార్మర్ లను ముట్టుకోవద్దని,ఈ విషయాలను గ్రామ సర్పంచ్ లు స్థానిక వాట్సాప్ గ్రూపులలో తెలియపరచాలని,వీలైతే డప్పు చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని,ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే 100 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వవలసిందిగా పోలీస్ సిబ్బంది తెలిపారు.