ఆస్థి తగాదాలతో వ్యక్తిని హత్య చేసిన కిరాతకుడు
ధర్మారం,జులై26(కలం శ్రీ న్యూస్):ఆస్తిని కాజేయాలనే నెపంతో సొంత అన్నయ్యను కిరాతకంగా పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో బుధవారం రోజున తెల్లవారు జామున సుమారు ఒంటిగంట సమయంలో గాలిపెల్లి అశోక్(36)అను అవివాహితున్ని హతమార్చాలనే ఉద్దేశ్యంతో అతని తోడబుట్టిన తమ్ముడు నరేష్,చెల్లెలు బైరీ పుష్పాలత,బావ బైరి అనిల్ అనే ముగ్గురు కలిసి అశోక్ గదిలో నిద్రిస్తున్న సమయంలో గది తలుపులకు బయట నుండి గడియ పెట్టి,కిటికిలో నుండి నిద్రిస్తున్న అశోక్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించగా మృతుడు అక్కడికక్కడే సజీవ దహనం అయినట్లు,వరుసకు అన్న అయిన కొక్కుల రామ్ నారాయణ ఇచ్చిన దరఖాస్తు మేరకు నిందితులను పెద్దపల్లి ఏసిపి ఏ మహేష్,పెద్దపల్లి సిఐ బి అనిల్ లు విచారించి హత్య కేసు నమోదు చేసినట్లు ధర్మారం ఎస్సై టి సత్యనారాయణ తెలిపారు.