కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎండపల్లి వీఆర్ఎలు
ఎండపల్లి రిపోర్టర్/ శ్రీకాంత్ గౌడ్
ఎండపల్లి,జులై 25 (కలం శ్రీ న్యూస్):వీఆర్ఎలను రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని, పే స్కేల్ ను పెంచడంతో చాలా సంతోషంగా ఉన్నామని ఎండపల్లి మండల వీఆర్ఎల సంఘం అధ్యక్షుడు ఉరిమెట్ల సత్తయ్య అన్నారు. మంగళవారం ఎండపల్లి తహశీల్దార్ కార్యాలయం ముందు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎండపల్లి తహశీల్దార్ మెండి ఉదయ్ కుమార్ కేక్ కట్ చేయగా.. వీఆర్ఎలు టపాసులతో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎల సంఘం అధ్యక్షుడు ఉరిమెట్ల సత్తయ్య,ఉపాధ్యక్షులు గోనె లలిత,ప్రధాన కార్యదర్శి జువ్వ శ్రీనివాస్,కోశాధికారి మద్దెల మల్లేశం,ప్రచార కార్యదర్శి గంధం ప్రసాద్,కార్యవర్గ సభ్యులు బెత్తపు రాయలింగు, బడికెల సుమలత,సామల స్వప్న,జువ్వ లక్ష్మణ్,లింగంపల్లి మహేష్,బెత్తపు ఆనసూర్య,బోయిని రాయలింగు,గుమ్మడి నవీన్,పంగ చంద్రయ్య,దేవి కనకయ్య, ఇతర విఅర్ఏలు రసుల బీ,దసండ్ల వరలక్ష్మి,అల్క నారాయణ,అల్కరాజయ్య,అలిమా బీ,సొన్నైల స్వాతి,గంధం శ్రీధర్,ఇనిగుర్తి లావణ్య,దొనిపెల్లి లచ్చయ్య,చొప్పదండి లక్ష్మీ, పాల్గొన్నారు.