కాకర్లపల్లి రోడ్డు జలమయం… ఆటో కి తప్పిన ప్రమాదం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 25 (కలం శ్రీ న్యూస్ ): మంథని మండలం కాకర్లపల్లి రోడ్డు పై నుండి వరద నీరు వచ్చి చేరుతుంది.మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి రోడ్డుపై వెళ్తున్న ఆటో అదుపుతప్పి నాళాలోకి వెళ్లి ప్రమాదం నుండి బయటపడింది .గొల్ల వాడలో రోడ్డు పై నుండి వరద నీరు ప్రవహిస్తుంది.దింతో ఇండ్లలోనికి వరద నీరు వచ్చి చేరుతుంది.గత కొన్ని సంవత్సరాలుగా చిన్న వర్షానికి రోడ్డు పై వరద వచ్చి చేరుతుందని దింతో ఇండ్లలోనికి నీళ్లు వస్తున్నాయని,పాములు, తేళ్లు కొట్టుక వస్తున్నాయని, స్టానిక ప్రజలు వాపోతున్నారు.ప్రజాప్రతినిధులు, అధికారులు, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.