Saturday, July 27, 2024
Homeతెలంగాణమంథని లో ఘనంగా ముగిసిన భాగవత సప్తాహం

మంథని లో ఘనంగా ముగిసిన భాగవత సప్తాహం

మంథని లో ఘనంగా ముగిసిన భాగవత సప్తాహం

బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూలై 25 (కలం శ్రీ న్యూస్ ):మానవుడు జ్ఞానాన్ని సంపాదించడం పై మాత్రమే దృష్టిని కేంద్రీకరించాలని బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర్ శర్మ అన్నారు. అప్పుడే మనిషి ముక్తిని పొందుతాడని ఆయన పేర్కొన్నారు.మంథని పట్టణంలోని తమ్మ చేరువు కట్ట శ్రీ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఏడు రోజులుగా పురాణం మహేశ్వర్ చెప్పుతున్న భాగవత సప్తాహం మంగళవారం ఘనంగా ముగిసింది.ఈ నెల 18న ప్రారంభమైన భాగవత సప్తాహం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.వేద గడ్డగా పేరు గాంచిన మంథని పట్టణంలో ప్రతినిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. పవిత్ర గోదావరి నది తీరం గల ప్రాంతంలో ఉన్న మంథని పట్టణంలోని దేవాలయాలను సందర్శించడానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు వచ్చి వెళ్తుంటారు.ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు సహితం ఏర్పాటు చేస్తుంటారు.మానవ జన్మ జ్ఞాన సముపార్జనకు ఉపయోగించాలని పురాణం మహేశ్వర శర్మ తెలిపారు.అలాగే మానవులు జ్ఞానం పొంది జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నారు.గురుపదేశం వలన మాత్రమే జ్ఞానం ముక్తి లభిస్తుంది అన్నారు.పాండిత్యం ఒక్కటే ఉంటే లాభం లేదని, జ్ఞానం సంపాదించడంపై మానవుడు దృష్టి కేంద్రీకరించాలని ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!