వర్షంలోను గడప గడపకు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించిన చల్లా నారాయణ రెడ్డి
మంథని,జూన్ 25(కలం శ్రీ న్యూస్ ):కాటారం మండలం చింతకాని గ్రామంలో గడప గడపకు పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం 13వ రోజు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి.గ్రామంలో ప్రతీ గడప,గడపకు వెళ్లి వారి కష్ట,సుఖాలు తెలుసుకొని,తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను తెలియజేస్తూ కేసీఆర్ ని మరొక్క సారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని గ్రామ ప్రజలందరిని కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలోనే సంక్షేమ పథకాలలో,అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమం రెండు సమతుల్యంగా జరుగుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు గృహ లక్ష్మి, గ్రామ గ్రామాల్లో సీసీ రోడ్డులు,డ్రైనేజీ కాలువలు,రైతు బంధు,రైతు భీమా,కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి వందలాది సంక్షేమ పథకాలను అందిస్తున్న కేసీఆర్ ని ముచ్చట మూడో సారి ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత మన మంథని ప్రజలందరితో పాటు తెలంగాణ ప్రజలందరికి పై ఉంది అన్నారు.గడప,గడపకు పాదయాత్రలో భాగంగా పలు కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.