దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందించిన తాళ్ళపల్లి మనోజ్ గౌడ్
కాల్వ శ్రీరాంపూర్,జూలై25(కలం శ్రీ న్యూస్):నిరుపేద యువకుడి దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందించిన బి.అర్.ఎస్ రాష్ట్ర నాయకులు తాళ్ళపల్లి మనోజ్ గౌడ్.పూర్తి వివరాలలో కెళితే కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన ఆర్నకొండ మల్లేష్ – పద్మ కొడుకు ఆర్నకొండ తిరుపతి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ డబ్బులు లేక ఆసుపత్రి కి పోలేక చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న తాళ్ళపల్లి మనోజ్ గౌడ్ తక్షణమే స్పందించి 5000/- దహన సంస్కారాల ఖర్చులకి స్థానిక నాయకుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడుగు రాజు కుమార్, ఎంపిటిసి సుముఖం నిర్మల మల్లారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కూకట్ల నవీన్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈర్ల శ్రీనివాస్, గౌడ సంఘం అధ్యక్షులు విరగోని సదయ్య, మల్యాల రవి గౌడ్, అసంపల్లి మహేందర్,కొక్కటి స్వామి,కన్నురీ విజయ్, కిషోర్, బాలయ్య, సుధాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.