నూతన కలెక్టర్ ను కలిసిన టీ డబ్ల్యూ జె ఎఫ్ నాయకులు
పెద్దపల్లి,జూలై24(కలం శ్రీ న్యూస్):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పెద్దపెల్లి జిల్లా కమిటీ సభ్యులు నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ముజమ్మిల్ ఖాన్ ని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పోగుల విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సుంక మహేష్ ,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఫణి సుదర్శన్, ఉపాధ్యక్షుడు బోయిని వినోద్, మహమ్మద్ ముఖేద్, దాసోహం గోపికృష్ణ, చొప్పరి సుమన్, సీనియర్ జర్నలిస్ట్ టీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.