తెలంగాణ కాయ్ కరాటే స్పోర్ట్స్ కమిషన్ సెక్రటరీగా కావేటి సమ్మయ్య నియామకం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 24 (కలం శ్రీ న్యూస్):కరీంనగర్ లోని తారక్ హోటల్లో కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం కాయి రాష్ట్రవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కాయ్ రాష్ట్ర అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్స్,ప్రధాన కార్యదర్శి నరేందర్,కోశాధికారి సాయికుమార్,పెద్దపెల్లి జిల్లా మంథని కి చెందిన కావేటి సమ్మయ్యను కాయ్ రాష్ట్ర కరాటే స్పోర్ట్స్ కమిషన్ సెక్రటరీగా నియమించి నియామక పత్రాలను అందజేశారు.నాపై నమ్మకం ఉంచి నన్ను రాష్ట్ర స్పోర్ట్స్ కమిషన్ సెక్రటరీగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి వి నరేందర్, కోశాధికారి సాయికుమార్,లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీరి నియామకం పట్ల రాష్ట్ర కాయ్ కన్వీనర్ చల్ల హరిశంకర్, కాయ్ చైర్మన్ వసంత్ కుమార్,కాయి చీప్ పాటర్న్ సినీ నిర్మాత సీనియర్ కరాటే మాస్టర్ శ్రీ రాజు, కాయి రిఫ్రి కమిషన్ చైర్మన్ పాపయ్య, గుంటిపల్లి సమ్మయ్య,హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.