కేటీఆర్ జన్మదినం సందర్బంగా విద్యార్థులకు పుస్తకాలు,పెన్నులు పంపిణీ చేసిన చల్లా
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని,జులై 24(కలం శ్రీ న్యూస్):తెలంగాణ తారక రాముడు,కల్వకుంట్ల వారసుడు మనసున్న మారాజు రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కి,రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ, పురపాలక,పరిశ్రమల శాఖ మంత్రిగా తన మార్క్ చూపిస్తూ దేశం హర్షించే నేతగా,రాష్ట్రం మెచ్చిన నాయకునిగా జన నీరాజనాలు అందుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 47వ జన్మదినం సందర్బంగా సోమవారం మంథని నియోజకవర్గం,కాటారం మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థులందరికి రాత పుస్తకాలు మరియు పెన్నులు అందజేసారు.అనంతరం విద్యార్థులందరి సమక్షంలో కేక్ కట్ చేసి,స్వీట్స్ పంపిణి చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, వారు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి చేసిన సేవలను, భారత దేశంలో హైదరాబాద్ నగరాన్ని ఐటీ రంగంలో ప్రథమ స్థానంలో ఉంచి,వారు సాధించిన ప్రగతి, అభివృద్ధిని గుర్తు చేస్తూ,వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఐశ్వర్యాలతో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాకుండా భారత యువతకు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.