Tuesday, October 8, 2024
Homeతెలంగాణవెల్గటూర్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

వెల్గటూర్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

వెల్గటూర్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

వెల్గటూర్,జూలై 24 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రములో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,పురపాలక,ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను సోమవారం రోజున బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చల్లూరి రాంచందర్ గౌడ్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వెల్గటూర్ లోనీ మెయిన్ రోడ్డు వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు కేక్ కట్ చేసి,మిఠాయిలు పంపిణీ చేశారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ…. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో “ఐటీ” రంగం అభివృద్ధి చెంది,యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పడ్డాయని,రాబోయే తరాలకు కేటీఆర్ ఆదర్శమని తెలిపారు.డిజిటల్ రంగంలో తెలంగాణ ముందుందని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్,బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్,పట్టణ అధ్యక్షుడు రంగు తిరుపతి గౌడ్,నాయకులు గోలి రత్నాకర్,పెద్దూరి భరత్,మనీష్,బొడ్డు రామస్వామి, ఎర్రోళ్ల మహేష్,బోడకుంటి రమేష్,తోగిటి ప్రభాకర్, మెరుగు అశోక్ గౌడ్,బిఆర్ఎస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!