శ్రీ మహాగణపతి ఆలయంలో సాయి భజన
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని, జూన్ 23(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలోని తమ్మి చెరువు కట్ట వీధిలో గల శ్రీ మహాగణపతి దేవాలయంలో ఆదివారం శ్రీ షిరిడి సాయిబాబా భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించారు.గత 15 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం భక్తుల గృహములలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరున్నర గంటల వరకు శ్రీ మహాగణపతి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని మంథని కి చెందిన సాయిబాబా భక్తుడు అవధానుల శ్రీనివాస్ పర్యవేక్షణలో సాయి భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. భజన కార్యక్రమం అనంతరం సాయిబాబా కు హారతి ఇచ్చి, మంత్రపుష్పం చదివి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు.