Saturday, July 27, 2024
Homeతెలంగాణఆహ్లాదకర వాతావరణంలో వుండే విధంగా వృద్ధాశ్రమం నిర్మాణం జరగాలి

ఆహ్లాదకర వాతావరణంలో వుండే విధంగా వృద్ధాశ్రమం నిర్మాణం జరగాలి

ఆహ్లాదకర వాతావరణంలో వుండే విధంగా వృద్ధాశ్రమం నిర్మాణం జరగాలి 

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

వృద్ధాశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

సుల్తానాబాద్,జనవరి24,(కలం న్యూస్):

తమ అనుభవాలతో తర్వాతి తరానికి మార్గదర్శకులుగా ఉండే వృద్ధుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలని, వృద్ధులకు ఇబ్బందులు ఏర్పడవద్దనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వ పరంగా వృద్దాశ్రమం ఏర్పాటు చేయుటకు నేడు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు.

సుల్తానాబాద్ లోని మార్కండేయ కాలనీలో ఐసిడిఎస్ కార్యాలయం ఆవరణలో ఎస్సీ గ్రాంట్ సుమారు 70 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన వృద్ధాశ్రమ నిర్మాణానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాకు ఒక మంచి ఓల్టేజ్ హోం ఏర్పాటు చేయాలని ఉద్దేశ్యంతో సుల్తానాబాద్ లో వృద్ధాశ్రమం నిర్మించనున్నట్లు, వయోవృద్ధుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నామని, అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని ఇటీవలనే జరుపుకోవడం జరిగిందని, అధికారికంగా ప్రతి సంవత్సరం వయో వృద్దుల దినొత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చాలా ఘనంగా వేడుకలు నిర్వహించు కుంటున్నామని, అదే సందర్భంలో వయో వృద్ధులకు ఉన్నటువంటి కొన్ని సమస్యలను, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇబ్బందులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కమిటీ మూడు నెలలకు ఒకసారి సమావేశమై సమస్యలను పరిశ్కరిస్తున్నది. వున్న ఆస్తిని పూర్తిగా రాసి ఇచ్చిన తర్వాత పిల్లలు పట్టించుకోకపోతే అనాధలుగా ఎక్కడ ఉండాలో తేలవడం లేదని, వారు ఒక జి. ఓ కూడా అడుగుతున్నారని, ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నదని అని, తిరిగివారి ఆస్తిని ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని ఉద్దేశ్యంతో ఒక ఆలోచన జరుగుతున్నదని తెలిపారు. చేపడుతున్న వృద్ధాశ్రమం నిర్మాణానికి చాలా స్థలం ఉన్నందున ఆహ్లాదకర వాతావరణంలో ఉండే విధంగా, కావలసిన లు సౌకర్యాలు కల్పించే విధంగా గొప్పగా నిర్మించాలని తెలిపారు.

అనంతరం ఎంపి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి దూరదృష్టి తో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని తెలిపారు.

అనంతరం ఎమ్మేల్యే మాట్లాడుతూ, మంత్రి తన శాఖ నుండి సుమారు 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న వృద్ధాశ్రమం భవన నిర్మాణానికి 50 లక్షలు ముందస్తుగా మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, సుల్తానాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, ఎంపిపి బాలాజీ రావు, కౌన్సిలర్ చింతల సునీత రాజు, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!