పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన పుట్ట శైలజ
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 22 (కలం శ్రీ న్యూస్):మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన బండి మహేష్ కూతురు బండి రిత్విక మరణించగా వారి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి అంతిమ యాత్రలో పాల్గొన్న మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ. మంథని మండలం ఎక్లాస్ పూర్ లో తగరం వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంథని మునిసిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ. వారి వెంట బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.