చిన్నారి ఆత్మహత్య
ధర్మారం,జూలై 22/( కలం శ్రీ న్యూస్):చిరు ప్రాయంలో కన్నవారిని వీడి ఉండలేక హాస్టల్ చదువు భారంగా బావించి తన పసి హృదయపు గోడును ఎవరికి తెలియపరచాలో తెలియక తనలో తానే మనస్థాపానికి గురై చిన్నారి బాలిక ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన పలువురి హృదయాలను కలిగించివేసింది.వివరాల్లోకి వెళితే పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన కనుకట్ల సంకీర్తన(14) తెలుకుంట గ్రామంలోని కస్తూరిబా గాంధీ స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్నది.హాస్టల్ లో ఉండి చదవడం,తల్లి తండ్రులకి దూరంగా ఉండడం ఇష్టం లేక జీవితం పై విరక్తి చెంది జులై 15 శనివారం రోజున తనకి తానుగా ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది.సంకీర్తన ఇంట్లో ఎవరు లేని సమయంలో రేకుల షెడ్డుకి చీర తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి సంకీర్తనను గమనించిన స్థానికులు,కుటుంబ సభ్యులు వెంటనే పెద్దపల్లి ఆసుపత్రి తరలించగా పరిస్థితి విషమించిందని అక్కడ వైద్యులు తెలుపగా అక్కడినుండి కరీంనగర్ ఆసుపత్రి కి తీసుకువెళ్లారు,చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాటం చేసిన సంకీర్తన శుక్రవారం రోజున రాత్రి మృత్యువాత పడిందని.ఆమె తండ్రి కనుకట్ల కమల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన్లు ధర్మారం ఎస్సై టి సత్యనారాయణ తెలిపారు.కనుకట్ల కమల్ కి ఇద్దరు కూతుర్లు మృతురాలు సంకీర్తన చిన్న కూతురు.