పారిశుద్ద కార్మికుల వంటా వార్పులో పాల్గొన్న బీఎస్పీ నాయకులు
మద్ధతు తెలిపిన బీఎస్పీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి నక్క విజయ్ కుమార్
వెల్గటూర్ జూలై 22 ( కలం శ్రీ న్యూస్):పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీఎస్పీ నియోజక వర్గ ఇంఛార్జి నక్క విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో గత 17 రోజులుగా పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొని వారి సమ్మెకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, బడుగు వర్గాలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. కార్మిక నేతగా పనిచేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. రాబోయేది బీఎస్పీ ప్రభుత్వమేనని కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ మండల అధ్యక్షులు బచ్చల స్వామి, బుగ్గారం, గొల్లపల్లి మండలాల అధ్యక్షులు గజ్జెల స్వామి,కల్లెపెల్లి తిరుపతి, ఉపాధ్యక్షుడు నక్క రాజేందర్ నాయకులు దబ్బేట సురేష్, దూడ గణేష్, సోషల్ మీడియా కో-కన్వీనర్ బచ్చల అంజి తదితరులు పాల్గొన్నారు.