11వ రోజు గడప గడపకు పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న చల్లా
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 21( కలం శ్రీ న్యూస్): గడప గడపకు పాదయాత్ర కార్యక్రమంలో 11వ రోజు శుక్రవారం కొత్తపల్లి తండా,మేడిపల్లి, బస్వపూర్ గ్రామలలో ఇంటింటికి,వాడ వాడకు వెళ్లి ప్రజా సమస్యలు, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి. గ్రామంలో ప్రతీ గడపగడపకు వెళ్లి వారి కష్ట,సుఖాలు తెలుసుకొని, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ని మరొక్క సారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని గ్రామ ప్రజలందరికీ వివరించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలోనే సంక్షేమ పథకాలలో,అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపారు.కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం రెండు సమతుల్యంగా జరుగుతున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు గృహ లక్ష్మి, గ్రామ గ్రామాల్లో సీసీ రోడ్డులు, డ్రైనేజీ కాలువలు,రైతు బంధు, రైతు భీమా,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,కేసీఆర్ కిట్ లాంటి వందలాది సంక్షేమ పథకాలను అందిస్తున్న కేసీఆర్ ని ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రిగా గెలిపించుకునే బాధ్యత మన మంథని ప్రజలందరితో పాటు తెలంగాణ ప్రజలందరికి పై ఉంది.
గడప గడపకు పాదయాత్రలో భాగంగా పలు కుటుంబాలను పరామర్శించి,ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డు సభ్యులు,బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,యూత్ నాయకులు,గ్రామస్తులు ఉన్నారు.