బీజేపీ పార్టీ లో చేరిన ముత్తారం మండల బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పెయ్యాల కుమార్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 21( కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రం లోని భాగ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ లో చేరికల కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ ముత్తారం మండల ప్రధాన కార్యదర్శి పెయ్యాల కుమార్ తో పాటు దాదాపు 200 మంది బీజేపీ లో చేరారు.వీరికి ముఖ్య అతిధి మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు.అనంతరం సునిల్ రెడ్డి మాట్లాడుతూ ఒక నియంతగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అణిచివేసిన శ్రీధర్ బాబు,ఏనాడూ తెలంగాణ ఉద్యమం చేయని పుట్ట మధుకర్ పదవులు అనుభవిస్తున్నారు. ముత్తారం రోడ్ల పరిస్థితి చూస్తే ఈ నాయకుల అభివృద్ధి అర్థం అవుతుంది,ఈ ముత్తారం నుండి వేల లారిల తో ఇసుక తరలించుకుంటూ పోతు మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు,ఒడెడ్ వంతెన సంవత్సరాలు గడుస్తున్న పూర్తి కావడం లేదు పాలకుల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు.బీజేపీ రోజు రోజుకు మరింత బలపడుతుంది, ప్రజల ఆశీస్సులతో ఈసారి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని, కెసిఆర్ కుటుంబ నియంత పాలనలో ప్రజలు అన్ని విధాలుగా విసుగు చెందారు. మంథని ప్రాంత ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.ఈసారి బీజేపీ పార్టీ ని గెలిపిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్,మండల ఇంచార్జ్ లు పోతారవేణి క్రాంతికుమార్,బిరుదు గట్టయ్య, శ్రీమల్లా తిరుమల్, సీనియర్ నాయకులు కొండాపాక సత్యప్రకాష్, బోగోజు శ్రీనివాస్, మూగ మల్లేష్, అమ్ము శ్రీనివాస్, మడిపోజు వెంకట్ రాజం, ఈదునూరి మల్లయ్య,ఎడ్ల సదశివ్,దేవునిరి కొమురయ్య, యువ నాయకులు కెక్కర్ల మహేష్, తోట నాగరాజు,ఉప్పు వరుణ్, దాసరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.