పార్వతీ బ్యారజ్,సరస్వతి పంప్ హౌస్,బొక్కల వాగును పరిశీలించిన రామగుండం సీపీ రెమా రాజేశ్వరి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 21(కలం శ్రీ న్యూస్ ):మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్వతీ బ్యారేజ్, సరస్వతి పంప్ హౌస్ లని శుక్రవారం రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్.,(డిఐజి),పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్,మంచిర్యాల డీసీపీ సుదీర్ కేకన్ ఐపిఎస్ లతో కలిసి పరిశీలించారు.గత రెండు రోజులుగా పడుతున్న వర్షం కారణంగా పంప్ హౌస్ లోకి భారీ వరద నీరు చేరే అవకాశం ఉండడంతో పంప్ హౌస్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి నీటిమట్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.మంథని పట్టణం లోని బొక్కల వాగును పరిశీలించారు.అదేవిధంగా వరదనీటి కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఏమైనా ఉంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నట్లయితే వెంటనే అధికారులకు తెలియజేయాలని వారికి సూచించారు.సీపీ వెంట గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాస్,మంథని సీఐ సతీష్, ఎస్ఐ ఆది మధుసూదన్, రామగిరి ఎస్ఐ రవి ప్రసాద్, తదితరులు ఉన్నారు.