Friday, December 27, 2024
Homeతెలంగాణగ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులు 

గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులు 

గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులు 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జులై 21(కలం శ్రీ న్యూస్): గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమ్మె 16 వ రోజున సీఐటీయూ జిల్లా నాయకులు బూడిద గణేష్ అధ్యక్షతన మంథని మండల అల్ పార్టీ,ప్రజాసంఘాలు,కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు.గ్రామ పంచాయతీ ఉద్యోగుల,ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని లేని యెడల సమ్మెను ఉదృతం చేస్తామని గ్రామ పంచాయతీ  ఉద్యోగులకార్మిక సంఘము జిల్లా అధ్యక్షుడు కసిపేట అశోక్ అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ మండల అధ్యక్షులు సెగ్గం రాజేష్,కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అజింఖాన్,బిఎస్పి మంథని నియోజకవర్గ ఇంచార్జి జనగామ రవికుమార్,ఏంఎస్పి మంథని నియోజకవర్గ ఇంఛార్జి మంథని సామిల్ మాదిగ,రైతుసంగం జిల్లా అధ్యక్షుడు గూడేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బూడిద తిరుపతి, నాయకులు ఆయేషా ఖన్,సతీష్ వేల్పుల వ్యవసాయ కార్మిక సంగం జిల్లా ఉపాధ్యక్షులు సురేష్,ఎస్ఆఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సoదీప్, రైతుసంగం జిల్లా సహాయ కార్యదర్శి గొర్రెక్కల సురేష్,శ్రీనివాస్ రెడ్డి,హరిఫ్, సింగరపు గట్టయ్య తదితర పార్టీల ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!