పార్వతీ (సుందిళ్ల) బ్యారేజ్ గేట్లు ఎత్తివేత
దిగువ ప్రాంతాల వాళ్లు అప్రమత్తంగా ఉండాలి
సర్ధార్ ఓంకార్ సింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని, జులై 21( కలం శ్రీ న్యూస్ ): పోలీస్,రెవెన్యూ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేయునది ఏమనగా పార్వతీ (సుందిళ్ల) పరివాహక ప్రాంతంలో( క్యాచ్మెంట్) వర్షాలు ఎక్కువగా ఉన్నందున ఈరోజు 21.07.2023 ఉదయం11:00నుండి పార్వతీ (సుందిళ్ల) వరద గేట్లు తెరిచి వరద నీటి ని గోదావరి నది లోకి విడుదల చేయటం జరుగతుంది.కావున నదీ పరివాహక ప్రాంతం లోకి (దిగువన) పశువులు గాని గొర్రెలు గాని మొదలగునవి వెళ్లకుండా అలాగే పల్లెకారులు, గొర్రె కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండవలెనని కోరనైనది.సర్ధార్ ఓంకార్ సింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ విభాగం నం.3, రామగుండం వారు తెలిపారు.