గురుకులాలను సద్వినియోగం చేసుకోగలరు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని,జులై 20( కలం శ్రీ న్యూస్): గురుకులాలను సద్వినియోగం చేసుకోగలరని ప్రిన్సిపాల్ వెంకటరామిరెడ్డి కోరారు.గురువారం పాత్రికేయులకు తెలిపిన ఓ ప్రకటనలో ఆయన వివరిస్తూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలురు) మంథని యందు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బైపిసి విభాగంలో గల 17 ఖాళీ సీట్ల ప్రవేశాల కొరకు 2022-23 వ సంవత్సరంలో పదో తరగతి ( సప్లమెంటరీ విద్యార్థులు కూడా) ఉత్తీర్ణులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సీ 10,బీసీ 2, ఎస్టీ 2, ఓసి 1, మైనార్టీ 1, ఎస్సి సి 1, సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆయన వివరించారు. అర్హత గల విద్యార్థులు కళాశాల పని వేళలో ( ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు) ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోగలరని ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి సూచించారు. వివరాల కొరకు 8099813990 నెంబర్ లో సంప్రదించగలరని ఆయన తెలిపారు.