Saturday, July 27, 2024
Homeతెలంగాణనాలుగేండ్లలో దీర్ఘకాలిక ఆలోచనతో అభివృధ్ది పనులు చేసినం

నాలుగేండ్లలో దీర్ఘకాలిక ఆలోచనతో అభివృధ్ది పనులు చేసినం

నాలుగేండ్లలో దీర్ఘకాలిక ఆలోచనతో అభివృధ్ది పనులు చేసినం

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జులై 20(కలం శ్రీ న్యూస్ ):కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇందరమ్మ పథకం ద్వారా నిబంధల ప్రకారం ఏ ఒక్క ఊరిలో వంద ఇండ్లు కట్టించి ఉంటే ఈసారి ఎన్నికల్లో ఓట్లు అడుగమని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సవాల్‌ విసరారు.గురువారం మహాదేవ్‌పూర్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రైతులకు మూడుగంటలు చాలనడంతో పాటు అనేక అంశాలు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డిలో తుపాకి రాముడు కన్పిస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.పూటకో మాట మాట్లాడుతూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని,అంతేకాకుండా రైతులకు అన్యాయం చేసేలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరును నిరసిస్తూ నిరసనలు చేపట్టితే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్సార్‌ ఫోటోలు, వీడియోలు పెడుతున్నారని ఆయన అన్నారు. ఆనాడు రాష్ట్రవ్యాప్తంగా 1350కిలోమీటర్ల పాదయాత్ర చేసి తొమ్మిది గంటల ఉచిత కరెంటు ఇచ్చి ఇటు రాష్ట్రంలో,అటు దేశంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్సార్‌ ఆనాడు కాంగ్రెస్‌ పార్టీకి దేవుడయ్యాడని అన్నారు.అయితే వైఎస్సార్‌ మృతి చెందిన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టించిన చరిత్ర కాంగ్రెస్‌పార్టీకే దక్కిందన్నారు. జగన్‌ను జైల్లో పెట్టించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈనాడు వైఎస్సార్‌ ఫోటోలు,వీడయోలు పెట్టడం సిగ్గు చేటని,వైఎస్సార్‌ పేరును ఎట్లా ఎత్తుతున్నారో జవాబు చెప్పాలన్నారు.కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ స్థాయిలో కుట్రలు చేస్తే మంథనిలో ఎమ్మెల్యే తానేం తక్కువంటూ కుట్రలు చేశారని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్‌ పార్టీకి ఎంత సేవ చేసినా గుర్తింపు ఉండని,రాష్ట్ర స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కుటుంబం,మంథని నియోజవకర్గ స్థాయిలో ముత్తారం మండలానికి చెందిన కిషన్‌రెడ్డిలే నిదర్శనమన్నారు.20ఏండ్లు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తూ దుద్దిళ్ల కుటుంబానికి సేవ చేస్తూ వాళ్ల పదవుల కోసం కష్టపడిన పోతిపెద్ది కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌లో తనకు గుర్తింపు ఉండటంలేదని బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరితే ఆయన ఇంట్లో గంజాయి పెట్టించి ఆ కేసులో ఇరికించాలని మంథని ఎమ్మెల్యే కుట్ర చేశాడని ఆయన గుర్తు చేశారు.ఇలాంటి సంస్కృతి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలు వస్తున్నాయని మళ్లా కొత్త పథకాల పేరు తెరపైకి తీసుకువస్తున్నారని, ఆకాశంలో చందమామను తీసుకువచ్చి మీ జేబులోపెడుతామంటే ప్రజలు నమ్ముతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మనం ఆలోచన చేయకపోవడం మూలంగానే 40ఏండ్లుగా ఒకే కుటుంబం అధికారంలో ఉంటూ ఆస్తులు కూడబెట్టుకుని అమెరికాలో ఆనందంగా ఉంటున్నారని ఆయన వివరించారు. కేవలం మూడు ఓట్లు ఉన్న ఆ కుటుంబం 40ఏండ్లుగా లక్ష ఓట్లను వాడుకుంటూ అధికారంలో ఉంటున్నారని,అయితే అధికారంలో ఉన్నప్పుడు అన్నం పెట్టలేదని,అధికారంలో లేనప్పుడు నాదేం లేదంటూ దాటవేసే నైజం ఎమ్మెల్యేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇటీవల ఎమ్మెల్యే స్వగ్రామమైన ధన్వాడలో అభివృధ్ది గురించి భూపాలపల్లి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌ ప్రశ్నిస్తే కాంగ్రెస్‌ నాయకులు స్పందిస్తూ శ్రీపాదరావు తల్లి 50ఏండ్ల కిందటే ఊరోళ్లకు చల్ల పోసిందని చెబుతున్నారని,50ఏండ్ల క్రితం చల్ల పోస్తే ఈనాడు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.కాంగ్రెస పార్టీ అంటేనే దేశానికి రాష్ట్రానికి చీకటేనని, వాళ్లు వెలుగుల్లో ఉంటూ మనల్ని చీకట్లోనే ఉంచుతారని, అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి, దేశానికి, గ్రామాలకు వెలుగులు తీసుకురాలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోనే రాష్ట్రాభివృధ్ది జరిగిందని, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు.

ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి రైతుబీమా, రైతుబంధు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.సరైన కరెంటు ఇవ్వకపోవడంతో ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో, విషకీటకాల బారిన పడి రైతు మృతి చెందితే ఆ రైతు కుటుంబం నాయకుల కాళ్ల మీద పడ్డా కనికరం చూపలేదని,ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆయన తెలిపారు.కానీ ఈనాడు అలాంటి పరిస్థితులు లేవని, రైతు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి రైతుబీమా ద్వారా రూ.5లక్షలు అందించి అండగా నిలుస్తున్నామని ఆయన గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తనకు నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తూ దీర్ఘకాలికంగా ఆలోచన చేసి అనేక అభివృధ్ది పనులు చేశామన్నారు. మహదేవ్‌పూర్‌ మండలం తన పరిధిలోకి రాదని ఏనాడు ఆలోచన చేయలేదని,ఇక్కడి పేద బిడ్డల ఉన్నత చదువు కోసం కస్తూర్బా పాఠశాలను తీసుకువచ్చామని, పక్కా భవనం లేకపోవడంలో అద్దె భవనంలో ఏర్పాటు చేసినా ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా తాను ఏడాది పాటు అదనపు అద్దెను చెల్లించానని ఆయన గుర్తు చేశాను.కాళేశ్వరం ప్రాంతం పర్యాటక ప్రాంతమైతే స్థానికులకు అనేక ఉపాధి అవకాశాలు లబిస్తాయని ఆలోచన చేసి అభివృధ్దికి శ్రీకారం చుట్టామని అన్నారు. తన స్వగ్రామానికి సాయం చేయని వాళ్లను నమ్మితే నట్టేట ముంచుతారని, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని,ఆలోచన చేసి చర్చిస్తేనే మన బతుకులు బాగుపడుతాయని,కాంగ్రెస్‌ను నమ్మితే కష్టాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!