అలా కాసేపు సరదా సరదాగా పుట్ట మధు
మంథని రిపోర్టర్ / నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 20( కలం శ్రీ న్యూస్):నిత్యం ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉండే జిల్లా పరిషత్ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కాసేపు సరదా సరదాగా గడిపారు. గురువారం కాటారం మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని మంథనికి వస్తున్న క్రమంలో మంథని మండలం అడవిసోమన్‌పల్లి వద్ద రోడ్డు ప్రక్కన ఓ రైతు స్వీట్ కార్న్ కంకులు అమ్ముతుండగా తన వాహనాన్ని ఆపి కొద్ది సేపు ఆ రైతుతో ముచ్చటించారు.అటు తర్వాత స్వీట్ కార్న్ కొని తింటూ కాసేపు సరదా సరదా గడిపారు. మాజీ ఎమ్మెల్యే,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పదవిలో ఉంటూ ఒక సామాన్యడిలా రోడ్డుపై స్వీట్ కార్న్ కొని తింటూ రైతుతో ముచ్చటించిన పుట్ట మధూకర్‌కు పలువురు హట్సాప్ చెబుతున్నారు.