మరోసారి మానవత్వాన్ని చాటుకున్న పుట్ట మదన్న
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 20 ( కలం శ్రీ న్యూస్):ఆపదలో ఉన్నామంటే నేనున్నానంటూ భరోసా కల్పించే నాయకుడు పుట్ట మధూకర్.నియోజకవర్గంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచే జడ్పీ చైర్మన్ మధూకర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. గురువారం కమాన్ పూర్ మండలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో రామగిరి మండలం జేఎన్టీయూ కళాశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడేల్లీ భాస్కర్ రెడ్డి అనే సెంటనరి కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు గాయపడగా వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ కార్మికుడిని ఆసుపత్రికి తరలించి మానవత్వానికి మారుపేరుగా నిలిచారు.