ఇంటింటికి గడప గడపకు పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న చల్లా నారాయణ రెడ్డి
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 20 (కలం శ్రీ న్యూస్ ):గడప గడపకు పాదయాత్ర కార్యక్రమంలో 10వ రోజు బయ్యారం గ్రామంలో గురువారం ఇంటింటికి,వాడ వాడకు వెళ్లి ప్రజా సమస్యలు,వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి.గ్రామంలో ప్రతీ గడప,గడపకు వెళ్లి వారి కష్ట, సుఖాలు తెలుసుకొని,తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ ని మరొక్క సారి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని గ్రామ ప్రజలందరికీ వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశంలోనే సంక్షేమ పథకాలలో, అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపారు.కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమం రెండు సమతుల్యంగా జరుగుతుంది.
గడప,గడపకు పాదయాత్రలో భాగంగా పలు కుటుంబాలను పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,యూత్ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.