మృతుని కుటుంబాన్ని పరామర్శించిన చల్లా నారాయణరెడ్డి
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 19 (కలం శ్రీ న్యూస్ ): మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ వాస్తవ్యులు మంథని జడ్పీటీసీ తగరం సుమలత శంకర్ లాల్ సోదరుడు తగరం వెంకటయ్య ఇటీవల మరణించగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించి,చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి,వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు దైర్యం ప్రసాదించాలని,కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి,ప్రగాఢ సానుభూతి తెలిపిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి.వారి వెంట ఎక్లాస్ పూర్ గ్రామ సర్పంచ్ చెన్నవేన సదానందం,రామగిరి ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్,బొంకూరీ పోశం,కాటారం మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు చీర్ల బాపు రెడ్డి, మాజీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డోలి అర్జయ్య,కిరణ్ గౌడ్,బోడ తిరుపతి,శ్రీను,రాజేశం రెడ్డి, అజ్మీరా వేణు,రాజు నాయక్,పోశి రెడ్డి,పులి గౌతమ్,బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.