Wednesday, December 4, 2024
Homeతెలంగాణఅధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి.

అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి.

అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి.

ఏబివిపి జిల్లా కన్వీనర్ అజయ్

పెద్దపల్లి,జనవరి25,(కలం శ్రీ న్యూస్):

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబివిపి జిల్లా కన్వీనర్ అజయ్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ అజయ్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రవేటు జూనియర్ కళాశాలలో విద్యార్థులను ఫీజుల పేరుట తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని, కళాశాలలో విద్యార్థులు చేరిక సమయంలో చెప్పిన ఫీజుల కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తు విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేధింపులకు గురి చేయడం జరుగుతుంది అని అన్నారు. అలాగే ఫీజులు చెల్లించని విద్యార్థులను వార్షిక పరీక్షలు రాయడానికి వీలు లేకుండా హాల్ టికెట్లు ఇవ్వమని అంటున్నారు. జిల్లా కేంద్రంలోని ట్రినిటీ జూనియర్ కళాశాల, గాయత్రీ జూనియర్ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా వేరే భవనాల్లో క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల నుండి పెద్ద మొత్తంలో ఫీజులు తీసుకోవడం జరుగుతుంది కావున వెంటనే ఈ సమస్యలు సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోరడం జరిగింది. లేనియెడల ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అజయ్, నగర కార్యదర్శి బండి రాజశేఖర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేల్పుల నాగ చంద్ర జిల్లా ఎస్,ఎఫ్,ఎస్ కన్వీనర్ రసురి ప్రవీణ్, శ్రీపతి సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!