గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 17 (కలం శ్రీ న్యూస్ ): గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని గత 12 రోజులుగా కార్మికులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బధాకరమని అన్నారు.గ్రామీణ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. న్యాయమైన డిమాండ్లైన వారికి కనీస వేతనం అమలు చేయడం పిఎఫ్ ఇఎస్ఐ అమలు చేయక పోవడం దుర్మార్గం అని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వంస్పందించాలని డిమాండ్ చేసారు.సమ్మెలో కల్పించిన్నటువంటి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న జిపి కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలగా వ్యవహరించి వీరి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వీరి యొక్క సమ్మెకు అన్ని సంఘాల మద్దతు కూడగట్టి ప్రభుత్వం దిగచ్చేవరకు సమ్మెను ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ ఈ సందర్భంగా తెలియజేశారు.ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కార్మికులు వేల్పుల సురేష్ తో పాటు జిపి కార్మికులు పాల్గొన్నారు.