వైభవంగా మడేలయ్య ఉత్సవాలు
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 16 (కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలోని రజకులంతా స్థానిక బొక్కలవాగులో తమ కులదైవం శ్రీమడేలయ్య ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.తమ నివాసాల నుంచి డప్పుల చప్పుళ్ళతో సామూహిక బోనాలతో ఊరేగింపుగా తరలి వెళ్ళి శ్రీమడేలయ్య, శ్రీ కట్ట మైసమ్మ, శ్రీపెద్దపోచక్క తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం నేతలు పోతరాజు సమ్మయ్య,శ్రీనివాస్,కొల్లూరి రాజయ్య, సమ్మయ్య,రమేష్, పైడాకుల నాగరాజు, చంద్రగిరి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.