Saturday, July 27, 2024
Homeతెలంగాణఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర వేడుకలు

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర వేడుకలు

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర వేడుకలు

మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జూలై 16( కలం శ్రీ న్యూస్): పట్టణంలో గంగమ్మ తల్లి బోనాల జాతర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయినిపేట నుంచి గంగమ్మ తల్లి బోనాల జాతర వేడుకలను గంగపుత్రులు ఘనంగా నిర్వహించారు.ప్రత్యేకంగా ఆలంకరించిన పల్లకిలో శ్రీ గంగామాత విగ్రహాన్ని ఉంచి కొబ్బరి కాయ కొట్టి గంగమ్మ తల్లి బోనాల వేడుకను ప్రారంభించారు. గంగాపుత్ర బెస్తలు తమ సంపద్రాయ వృత్తి అయిన చేపలు పట్టే పెద్ద వలను అందంగా ఆలంకరించి ప్రదర్శిస్తుండగా, మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని ర్యాలీగా గోదావరి వరకు తరలి వెళ్లారు.ఈ బోనాల వేడుకల్లో మంథని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ,ఎంపీపీ కొండ శంకర్‌,మున్సిపల్‌ వైస్ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌,కౌన్సిలర్లు నక్క నాగేంద్ర శంకర్‌,వీకే.రవి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డిలు వేర్వేరుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ,ఎంపీపీ కొండ శంకర్‌లు గంగాపుత్రులతో కలిసి బోనాన్ని నెత్తిన ఎత్తుకున్నారు.మహిళలు బోనాలు నెత్తి మీద ఎత్తుకోగా, పురుషులు చేపలు పట్టే వలలు, బుట్టీలు పట్టుకోవడంతో పాటు పల్లకిలో గంగమ్మ,గౌరమ్మలను పెట్టుకొని గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించేందుకు డీజే సౌండ్స్‍, డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేసుకుంటూ తరలి వెళ్లారు.ఈ ర్యాలీలో పలు చోట్ల గంగాపుత్రుల బెస్తలు తమ సంప్రదాయ వృత్తి అయిన చేపలు పట్టే విధానాన్ని ప్రదర్శించారు.ఆనంతరం గోదావరి తీరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెపై గంగమ్మ తల్లి, గౌరమ్మ, మత్స్యగిరింద్ర, చేప, తాబేలు ప్రతిమలను పెట్టి వివిధ రకాల పూలు,పసుపు, కుంకుమలతో ప్రత్యేకంగా పూజించారు.ఆనంతరం గంగ, గౌరమ్మలతో పాటు మత్స్యగిరింద్ర,చేప,తాబేలు ప్రతిమలను గోదావరిలో నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా అమ్మవారికి సమర్పించిన బోనాలను గంగాపుత్రులు ప్రసాదంగా స్వీకరించి కృపకు పాత్రులయ్యారు.ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘం నాయకులు గంధం వెంకటస్వామి,అంకరి ప్రకాశ్‌, అంబటి సతీష్‌, అంకరి శివ, జీదుల రాజేందర్‌,అంబటి కుమార్‌, బోయిని నారాయణ, అంబటి నర్సింగ్, అటికేటి కోటేష్‌, బోయిని రవి, మోసం శంకర్‌, మోసం నర్సయ్య, అంబటి రాజ్‌కుమార్‌, మోసం సతీష్‌, ఎరువ చంద్రమోహన్‌లతో పాటు అధిక సంఖ్యలో గంగపుత్ర బెస్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!