Saturday, July 27, 2024
Homeతెలంగాణపురాతన సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల జాతర

పురాతన సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల జాతర

పురాతన సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల జాతర

ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి

సుల్తానాబాద్ జులై 15 (కలం శ్రీ న్యూస్) :పురాతన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల జాతర నిలుస్తుందని ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో అంగరంగ వైభవంగా బోనాల జాతరనునిర్వహించారు. ముందుగా విద్యార్థులతో పాటు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి బోనంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పండుగలకు నిలయమని, పండుగల యొక్క విశిష్టతను కాపాడటం లో అల్ఫోర్స్ విద్యాసంస్థలు ముందుంటాయన్నారు. మన పురాతన పండుగలను ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. డిజిటల్ యుగంలో పండుగలకు ఇస్తున్న ప్రాముఖ్యత తగ్గిపోతుందని, మన పండుగల ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకే విద్యార్థులకు పాఠశాలలోనే పండుగ లను వారిచేత నిర్వహింపచేసి, భవిష్యత్తు తరాలకు బాసటగా నిలుస్తున్నామన్నారు. మహిళలకు ప్రీతికరమైన పండుగ బోనాల పండుగ అని, బోనం నెత్తిన ఎత్తుకోవడం ద్వారా వారి ఇళ్లల్లో సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత నిస్తుందని, బోనాల సమర్పణ అనంతరం అత్యంత కీలక ఘట్టమైన భవిష్యవాణి కార్యక్రమాన్ని ప్రజలందరూ ఆసక్తితో ఉత్కంఠతో ఎదురు చూస్తారని, ఆషాడ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి శాంతింపజేసి ఆశీర్వాదం పొందుతారని విద్యార్థులకు వివరించారు. భవిష్యత్తులో మన విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిలో ఆధ్యాత్మిక భావాన్ని పెంచడానికే పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అనంతరం విద్యార్థులు పాటలకు అనుగుణంగా చేసిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. అలాగే పాఠశాలలో నిర్వహించిన హౌస్ ఎలక్షన్స్ లో గెలుపొందిన క్యాప్టెన్, వైస్ కెప్టెన్ లకు బ్యాడ్జీలను ధరింపజేసి వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకు బృందం విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!