Saturday, July 27, 2024
Homeతెలంగాణగ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి

గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి

గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి

సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జులై 15( కలం శ్రీ న్యూస్):మంథని ఎంపీడీవో కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం మంథని మున్సిపల్ కార్మికులు మంథని పురవీధులగుండా ర్యాలీ తీసి వారి సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు వారి యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని తీసుకువచ్చి గ్రామపంచాయతీ కార్మికులపై అధిక భారం మోపిందని అన్నారు.వారికి ఒక గుర్తింపు లేకుండా చేసిందని అన్నారు.కరోనా విపత్కర సమయంలో గ్రామపంచాయతీ కార్మికుల సేవల వల్లనే గ్రామాలు సురక్షంగా ఉన్నాయని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం వారి యొక్క సంఘ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు చింతల గోవింద్,ఎడ్లపల్లి రాజయ్య,చందు, గ్రామపంచాయతీ సిబ్బంది కొమురయ్య ,అశోక్,రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!