గంగాదేవి బోనాల జాతరను విజయవంతం చేయండి
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 15(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న గంగాదేవి బోనాల జాతరను విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ నాయకులు గంధం వెంకటస్వామి,అంబటి సతీష్,అంబటి కుమార్,బోయిని నారాయణ,అంకరి శివ మురళిలు కోరారు.మంథని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగాదేవి బోనాల జాతర బోయినిపేట నుండి గోదావరినది వరకు బోనాలను ఎత్తుకొని జాతరగా వెళ్లడం జరుగుతుందన్నారు.మంథని మండలంలోని గంగపుత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ,భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ లు హాజరు కానున్నట్లు వారు పేర్కొన్నారు.